మచిలీపట్నం లో సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక - మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు