యూరియాను తగిన మోతాదులో వినియోగిస్తే అధిక దిగుబడులు వస్తాయని ఏడీఏ విద్యావతి రైతులకు సూచించారు. యాడికి మండల కేంద్రం తో పాటు నిట్టూరు గ్రామంలో బుధవారం యూరియా పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అర లీటర్ యూరియా ఎకరాకు వాడుకోవచ్చునన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకొని పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు.