ఉపరాష్ట్రపతి ఎన్నికలలో NDA అభ్యర్థికి మద్దతు ఇస్తున్న TDP, YCP తీరును పీసీసీ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు.శుక్రవారం విజయవాడలో ఆమె మాట్లాడారు.ఉపరాష్ట్రపతి పదవికి తెలుగు వ్యక్తి పోటీ చేస్తుంటే టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం సరికాదన్నారు. సుదర్శనరెడ్డి కులానికే చెందిన జగన్ కూడా NDAతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని విమర్శించారు.