శివాజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ ప్రతిమను మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం 11 గంటలకు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు అందుకున్నారు. స్వామివారికి పూజలు చేసారు. విఘ్నాలు తొలగించేందుకు విఘ్నేశ్వరుని ఎల్లప్పుడూ ప్రార్థించాలని వెంకయ్య నాయుడు తెలిపారు. దేశ పురోగతిని చూసి ఓర్చుకోలేని కొన్ని దేశాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి భారత్ మరింత శక్తివంతంగా, ప్రపంచానికి తలమానికంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు