తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కే వి బి పురం మండలం తిమ్మసముద్రం వంతెన పైనుంచి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే కేవీపీ పురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను బాలకృష్ణయ్య సొంత పనుల నిమిత్తం కే వి బి పురం వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెనపై నుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో బాలకృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు వైద్యులు వెంటనే ఇతరని తిరుపతికి తరలించమని రైతులు సూచించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకుచేరుకుని విచారణ చేపట్టారు