అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం మామిళ్ళపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని అనంతపురం నగరంలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందిన వంశీ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంలో సీతారాంపల్లి వద్దకు వెళుతుండగా మామిళ్ళపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.