హయత్ నగర్ లోని అయోధ్య సీతారాంపురంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో నెలకొన్న సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని కార్పొరేటర్ కు వివరించారు. స్పందించిన కార్పొరేటర్ అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.