కర్ణాటక ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీటితో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 2,72,000 క్యూసెక్కులు వస్తోంది. దీంతో ప్రాజెక్టు 24 గేట్లు ఓపెన్ చేసి 2,51,578, పవర్ హౌస్కు 28,703, కుడి కాలువకు 700, ఎడమ కాలువకు 820, పార్లర్ కాల్వకు 400, భీమా లిప్ట్కు 750 మొత్తం 2,82,268 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.