పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు సోమవారం ఆదోని సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పెద్ద తుంబలంలో రెండు బ్యాంకులు, పోలీస్ స్టేషన్ ఉండి 12 గ్రామాలకు సేవలందిస్తోందని తెలిపారు. 18వ శతాబ్దం రామాలయం, ప్రసిద్ధ జైన్ టెంపుల్ కూడా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు.