పలాస మండలం గరుడఖండి గ్రామానికి చెందిన కవిటి నిఖిలేష్ (19), ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం గ్రామానికి చెందిన తూముల కార్తికేయ (19)జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి పాఠశాలలో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్లకు బానిసై ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.ఈనెల 14వ తేదీన పలాస మండలం టెక్కులిపట్నం గ్రామంలో ఓ స్కూటీని, 18వ తేదీన కాశిబుగ్గ పట్టణంలో వచ్చి చక్రవాహనాన్ని దొంగలించారు.అనంతరం ఈ రెండు వాహనాలను విశాఖలో అమ్మేందుకు తరలిస్తుండగా కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడినట్లు శనివారం సాయంత్రం డిఎస్పి వెంకట అప్పారావు మీడియాతో తెలిపారు.