ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద ఫోర్ వీల్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు చెవుల రాజు కొండమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని మేడేపి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.