రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జగ్గంపేట సర్వీసు రోడ్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు విజృంభణ) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి కే.సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో హైస్కూల్, జూనియర్ కళాశాలలు, ఐటిఐ కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు బస్సు పాసుల నిమిత్తం అధిక మొత్తంలో సొమ్ములు చెల్లించుకుంటూ,ఆర్థిక ఇబ్బందులతో చదువులు సాగిస్తున్నారని ఆయన అన్నారు.