యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినట్లు శుక్రవారం 04.00 గంటలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. గణపతి నిమజ్జనం ఏర్పాటు శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా గణపతి నవరాత్రి శోభాయాత్ర ఉత్సవాలను జరుపుకోవాలన్నారు.