టేకులపల్లి కి చెందిన 13 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.కోట్ల రూపాయల సైబర్ నేరానికి పాల్పడ్డ నిందితులు. కొద్ది కాలంలోనే కోటీశ్వరులు కావాలన్నా దురాశతో కొంతమంది యువకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. భారీ స్కాం కు తెర లేపుతున్నారు. ఈ స్కాం టేకులపల్లి కేంద్రంగా జరగడం సంచలనం సృష్టించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం లోని మండల కేంద్రంలో బోడ శ్రీధర్ అనే మీసేవ కేంద్రం నిర్వహించే వ్యక్తి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈయనతోపాటు మరో 12 మంది కలిసిభారీ స్కాం కు పాల్పడ్డారు.