కాగజ్నగర్ పట్టణానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొట్టమొదటిసారిగా కాగజ్నగర్ కు రావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ తీసి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం ప్రధాన కార్యదర్శిగా తనకు గుర్తింపు మాత్రం కాదని సిర్పూర్ నియోజకవర్గానికి ఇచ్చిన గౌరవం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అంకితభవంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు,