సూపర్ హిట్ సభ కు సుమారు నాలుగు లక్షల మంది తరలి వచ్చారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం కావడానికి చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలకు ఉపక్రమిస్తున్నారని అనంతపురం సభపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని అన్నారు. జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని కూటమి ప్రభుత్వంపై ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఏపీలో యూరియా కొరతకు కారణం వైసీపీ నే అని యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.