జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వారి అవినీతిని ప్రజలకు చూపించేందుకు కావలి వెళుతుంటే తమను పోలీసులు అడ్డుకోవడం దారుణం అన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాము బయటకు వస్తే ఏదో ఒక రకంగా అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు