నిజాంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలానికి సంబంధించి గత కొద్ది రోజుల నుండి జర్నలిస్టులకు స్థలాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టియుడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్ సోదరులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ డిజి శర్మ, రాష్ట్ర సోషల్ మీడియా మిన్పూర్ శ్రీనివాస్, ఐజేయు సభ్యులు అశోక్, బొందుగుల నాగరాజు పాల్గొన్నారు.