కాగజ్నగర్ పట్టణంలోని పెద్దవాగు వద్ద జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గత సంవత్సరం జరిగిన తప్పిదాలను పునరువృతం కాకుండా చూడాలని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కరెంటు సమస్య లేకుండా ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎస్సీ రాథోడ్ శేషారావుకు సూచించారు,