ఉల్లి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉల్లి రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఉల్లి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు రైతులు ఆందోళన చెందుద్దని భరోసా కల్పించారు రైతుల నుంచి ఉల్లిపాయను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్క్ఫైడ్ అధికారులను మంత్రి ఆదేశించారు