శ్రీకాళహస్తిలో ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ శ్రీకాళహస్తిలోని టైలర్లకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డులను మంజూరు చేసింది. వీటిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని ఇచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. దీని ద్వారా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందించే పథకాలకూ ఈ కార్డు అవసరమని గుర్తు చేశారు.