నల్లగొండ జిల్లా: రైతులకు సకాలంలో యూరియాను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు నన్నూరు వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం తిప్పర్తి మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయంపై ధర్నా నిర్వహించి వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. వరి నాట్లు వేసిన యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.