నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ వైయస్సార్ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం రాత్రి నల్ల నాగు పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సయ్యద్ యాసిన్ కు సమాచారం అందించారు. ఆరు అడుగుల పొడవున్న నల్లనాగు పామును చాకచక్యంగా పట్టుకొని పట్టణ సమీపంలో గల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.