రామాయంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. భారీ వర్షాలకు స్థానిక ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని, వారికి మద్దతుగా రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బస వద్దకు అయన వెళ్లి వారిని పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వరదలో చిక్కుకున్నరని వారందరిని పోలీసులు అధికారులు యువకులు అంభినందించారు.