శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో గురువారం మధ్యాహ్నం కలెక్టర్ టీఎస్ చేతన్ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లను పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. వర్షాకాలంలో పాడిపశువులకు గాలి కుంట వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని, వాటిని నివారించేందుకు ముందస్తు టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 15 నుంచి నెలరోజులపాటు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.