భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు. తగరపువలసలో నివాస ముండే వెంకట ప్రమీల(32)తో అదృష్య మయ్యినట్లు తెలిపారు. ఆమె భర్త విజయవాడ, కృష్ణలంక ప్రాంతానికి చెందిన బి.శివకృష్ణ చిప్పాడ దివిస్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమీల కనిపించడం లేదని శివ కృష్ణ కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భీమిలి సీఐ.బి.తిరుమల రావు దర్యాప్తు నిమిత్తం ఈ కేసును హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అప్పగించారు.