నేడు మంగళవారం వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి 16 వ వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని సాయిరాం థియేటర్ దగ్గర ఉన్న వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలసి వెళ్లి పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన ప్రజలకు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకుంటూ.. ప్రజలకు ఆయన చేసిన సేవలను మరువలేమని అన్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు.