సోమవారం ఉదయం గద్వాల జిల్లా మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అధికారి సునంద వేధింపులకు గురి చేస్తుందంటూ జిల్లా కలెక్టర్ సంతోష్ కు ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు.మొదట సమస్యను గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డికి క్యాంపు కార్యాలయంలో వివరించగా ఎమ్మెల్యే అంగన్వాడీ టీచర్లను వెంటబెట్టుకుని కలెక్టర్ కు కలిసి ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ అంగన్వాడీ పీడీ సునంద కింద పనిచేసే ఉద్యోగులను నోటికి రానట్టు తిడుతుందని,ఆమె భాద భరించలేకపోతున్నామని వాపోయారు.