తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న ఓపెన్ ఎస్.ఎస్.సి.ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు తో కలిసి పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, ఖజానా, తపాలా, పురపాలక, విద్యుత్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ ఎస్.ఎస్.సి., ఇంటర్ పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.