గోదావరి నదిపై చేపల వేట నిషేధాన్ని ఉల్లంఘించి యానం నుంచి వచ్చిన కొందరు అక్రమంగా వేట సాగిస్తున్నారని అగ్నికుల క్షత్రియ నాయకుడు మల్లాడి పోసియ్య ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం తాళ్లపూడి లో ఆయన మాట్లాడుతూ, వరద కారణంగా నదిలోతు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. అక్రమ వేటను అడ్డుకుంటే తమపై దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.