రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ అధ్యక్షుడు రతన్ లాల్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు యూరియా కోసం రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు, చంటి పిల్లలతో కలిసి మహిళలు యూరియా కోసం బాలు తీరడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని, రైతులు ఇబ్బందులు పడుతున్న యూరియా కష్టాలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.