డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి,ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం దౌదర్‌పల్లి సమీపంలో ఉన్న రెండు పడక గదుల ఇండ్ల పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,సెప్టెంబర్ మొదటి వారంలో గృహాల ప్రారంభోత్సవం చేపట్టనున్నందున, మిగిలి ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.దాదర్ పల్లి వద్ద నిర్మితమైన 715 ఇళ్లలో విద్యుత్ సౌకర్యాలు, పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నందున, వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.