ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. అమ్మవారి విగ్రహానికి కట్టిన చీర తొలగించారు. ఆభరణాలను ఆలయ ప్రాంగణంలో విసిరేశారు. గంటలను ధ్వంసం చేసి విద్యుత్ వైర్లు కట్ చేశారు. సమీపంలో ఏదో పూజలు చేసిన ఆనవాలు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.