ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలని కోరారు. ఏఎన్సీ విధానం, స్కూటం డబ్బాల టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పారితోషికం తగ్గించాలని ఆలోచన విరమించుకోవాలని అధికారుల వేధింపులు అరికట్టాలని కోరారు.