సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 10, 24 తేదీల్లో యుడిఐడి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ సోమవారం తెలిపారు. యుడిఐడి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఫోన్కు మెసేజ్ వచ్చినవారు మాత్రమే క్యాంపునకు హాజరుకావాలని ఆయన సూచించారు. స్లాట్ పేపర్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మెడికల్ సర్టిఫికెట్లతో పాటు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.