కర్నూలు నగరంలో నాసిరక నిర్మాణాల పనుల వల్ల ప్రమాదాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని పట్టణ పూర్వ సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 12 గంటలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో వారు కర్నూలు నగరంలోని ఐ టి సి వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా నాసిరక కల్వర్టు నిర్మాణం వల్ల ఒ లారీ కలవట్లో ఇరుక్కుపోయి ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్ల లేదని తెలిపారు. తక్షణమే నాసిరకం నిర్మాణాలు చేపట్టకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.