విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు.