రెల్లి వీధిలో రెల్లి కులస్తుల కోసం సంక్షేమ భవనం నిర్మాణాన్ని 36వ వార్డు కార్పొరేటర్ మేరీ జాన్స్ తన పరిధిలో ఉందంటూ అడ్డుకోవటాన్ని 37 వ వార్డు కార్పొరేటర్ చిన్న జానకిరామ్ ఖండించారు. సంక్షేమ భవనం వద్ద బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ భవనం అనేది ప్రజలందరికీ ఉపయోగపడే స్థలమని దీని నిర్మాణాన్ని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. గత నెల 20వ తేదీ నుంచి ఇప్పటివరకు పనులు శరవేగంగా పూర్తి చేస్తూ స్లాబ్ వరకు వచ్చేసాము అని, మొదట్లో అడ్డుకోకుండా ఇప్పుడు స్లాబ్ వద్దకు వచ్చిన తర్వాత అడ్డుకోవడం సరికాదన్నారు. భవన నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించాలని అధికారులను కోరారు.