తాడిపత్రి పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం నుంచి ఏఎస్పీ కార్యాలయం వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి మంచం వేసుకొని అక్కడే పడుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అందించారు. అయితే ఆ డిమాండ్ల అమలకు ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఏఎస్పీ కార్యాలయం ఎదుటి జెసి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.