అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంస్కారం లేని వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్య నారాయణరెడ్డి విమర్శించారు. వైసిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. శనివారం అనపర్తి వైసిపి కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, బెల్ట్ షాపులు అక్రమ మైనింగ్ నడుపుతూ ఎమ్మెల్యే సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు.