వైసిపి తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా కుట్రలు చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట 29 నిమిషాల సమయంలో వాట్స్అప్ లో నోటీసులు పంపించారని మండిపడ్డారు. అడుగడుగునా కార్యకర్తలని అడ్డుకున్నారని.. 19 షరతులు విధించారని కాకాని మీడియాకు తెలిపారు. డైకాస్ రోడ్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.