ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు సమీక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థుల గైర్హాజరు పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలని తెలిపారు.