మామిడికుదురు మండల పరిషత్ సమావేశం ఎంపీపీ వనజ కుమారి అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో మండలం లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. పెదపట్నం గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలని గ్రామ సర్పంచ్ దుర్గ కోరగా లూటుకుర్రులోని పంట కాలువల్లో సాగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పైపులైన్లను తొలగించాలని ఎంపీటీసీ వెంకటేశ్వరరావు కోరారు. ఏవో సత్యనారాయణ మండలంలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు.