కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో గల ఓ బిల్డింగ్ పై నుండి ప్రమాదవశాత్తు యువకుడు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం తెలిసిన వివరాల మేరకు యర్రగుంట్ల పట్టణంలోని వినాయక నగర్ కు చెందిన ఏసన్న కుమారుడు జాన్ భవన నిర్మాణ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం బిల్డింగ్ పైకి ఇటుకలను తీసుకువెళ్తూ ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్తు నుంచి కింద పడడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.