అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం చింతలవిధి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో నిమజ్జనోత్సవం జరుగుతుండగా దూసుకెళ్తున్న స్కార్పియో వాహనం కారణంగా ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమం గా ఉండటంతో పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని బంధువులు స్థానికులు ధ్వంసం చేశారు. నేషనల్ 516 ఈ హైవేపై ప్రమాదం జరగడంతో రోడ్డుపై బైఠాయించి వాహనాన్ని నిలిపివేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.