మహబూబ్నగర్ జిల్లా: కాలేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన అక్రమాలపై ప్రభుత్వం కేసులు సిబిఐకి అప్పగించిన బిజెపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి వాకిటి శ్రీహరి గురువారం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్కు బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని బిజెపి బిఆర్ఎస్ ఒకటే అని ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని విమర్శించారు. సిబిఐ దర్యాప్తుతో దోషులు వెలుగులోకి వస్తారని ఆయన తెలిపారు.