పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం, చాగంటివారిపాలెంకు చెందిన లింగారెడ్డి (51) సోమవారం మధ్యాహ్నం 3గంటాలకు ఆత్మహత్య చేసుకున్నారు.తన భర్తకు 40% కన్నా తక్కువ అంగవైకల్యం ఉన్న కారణంగా పింఛను రాదని తెలియడంతో మనస్తాపానికి గురై MRO కార్యాలయం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య రామలింగమ్మ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.