ఆదోనిలో గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. సుమారు 86.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రామజల చెరువులోకి వరద నీరు పోటెత్తింది. చెరువు నిండుకుండలా మారి పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాలలో నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు