గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన లక్ష చీరల సుందర వినాయకుడిని దర్శించుకోవడానికి బుధవారం భక్తులు పోటెత్తారు. నగర పోలీస్ కమిషనర్ వినాయక విగ్రహాల దర్శనానికి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సుందర వినాయకుడి దర్శనానికి మాత్రం నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ భక్తులు ఆరోపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాల గురించి గుర్తు చేస్తే నిర్వాహకులు తమపై దాడి చేశారంటూ భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం కాస్త రచ్చగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిలో ఓ పాపకు గాయం అయిందని పాపను ఆసుపత్రికి తరలించార