ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిలర్ల సమావేశం శనివారం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో అధికారుల తీరుపై కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే, అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ మండిపడ్డారు.